YSRCP ఓటమికి కారణాలు..ఇవి నిజమేనా… ?

యూనియన్లు జరిపిన ఐక్యత శక్తి యే.. వైసీపీ ఓటమి.

0
200

యూనియన్లు జరిపిన ఐక్యత శక్తి యే.. వైసీపీ ఓటమి.

సామాన్యులు చెప్పింది నిజమనిపిస్తుంది.


వైఎస్ఆర్సిపి ఓటమిపై విభిన్న కథనాలు వెలువడుతున్నాయి కొందరి నోటి దురుసు వలన ఓటమిపాలయ్యింది, అని కొందరు అంటుంటే. మరికొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రంకెలు వేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ. అడ్డగోలుగా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే. తిరిగి సమాధానం చెప్పడం తప్పెలా అవుతుంది ముందు రెచ్చగొట్టింది ఎవరు? అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.


మరికొందరు విశ్లేషణాత్మక ధోరణిలో.. చంద్రబాబు నాయుడు గారి స్ట్రేటజీలను వివరించారు. ఈ కారణాలే టిడిపి గెలవడానికి మూలం అంటూ వివరించారు.
చంద్రబాబు గారి స్ట్రేటజీల లో అతి ముఖ్యమైన స్ట్రాటజీ.
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యూనియన్ లను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం.
వాటిలో ముఖ్యమైనవి.

టిడిపి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడో.. లేక నందమూరి వంశమో… కాదు


1) కుల కట్టడి. :- సామాజిక వర్గం రీత్యా తెలుగు రాష్ట్రాలలో ఏ కులం కానీ ఏ వర్గం కానీ నిజాయితీగా పాటించనటువంటి కుల కట్టడి ఈ సామాజిక వర్గంలో ఉంది అని అలాగే. యావత్ సామాజిక వర్గం కుల పెద్దల తీర్మానాలకు విరుద్ధంగా ఎన్నటికీ పోదు అని, ఒకరకంగా టిడిపి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడో.. లేక నందమూరి వంశమో… కాదు, అది ఆ కుల పెద్దల యూనియన్ అని వారి అభిప్రాయాలు చెబుతున్నారు అంతేకాకుండా ఆ సామాజిక వర్గం నుండి ప్రతి ఒక్క ఓటరు ఒక నాయకునిలా కష్టపడి ఓట్ల సంగ్రహణ జరిపారని అంటున్నారు.
అతి ముఖ్యమైన స్ట్రాటజీ
2) రాష్ట్రంలో ఎన్నో రకాల యూనియన్లు ఉన్నాయని వాటికి ఒక సిద్ధాంతం ఉంది “కష్టం వచ్చినా నష్టం వచనా ఆదుకునేది యూనియన్ మాత్రమే” ఈ సిద్ధాంతానికి కట్టుబడి యూనియన్ మాటను జవదాటని విధానంతో మాత్రమే యూనియన్ లలో ఉంటారు.
అవి కొన్ని .ఎంప్లాయిస్ యూనియన్లు అలాగే, కొన్ని .వర్కర్స్ యూనియన్లు అలాగే మరికొన్ని .వృత్తిపరమైన యూనియన్లు ఇలా యూనియన్లకు సంబంధించి వారి వారి కుటుంబాల ద్వారా రాష్ట్రంలో 50 శాతం పై వరకు యూనియన్ల ప్రభావిత ఓట్లే ఉంటాయని. యూనియన్లకు అందవలసిన తైలాలు అందించిన తరువాత యూనియన్లో ప్రతి ఒక్క సభ్యుడు వారి వారి కుటుంబాలతో ముందు మనం చంద్రబాబును గెలిపించుకుందాం. అనే మాట వచ్చిన తర్వాత గెలుపుపై ధీమా పెంచుకున్నారని ప్రతి యూనియన్ నుండి స్పష్టమైన సంకేతాలు అందిన తరువాత, వాటన్నింటినీ ఏకం చేసి తనకు ఓట్లు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసుకోగలిగారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు
మూడవ స్ట్రాటజీ


3) పుట్టగొడుగుల్లా నామినేషన్లు.
చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు పుట్టుకొచ్చే కొన్ని పుట్టగొడుగుల పార్టీలు ఉన్నాయి మా కులం మా వర్గం అంటూ ఎంత కాలం మేము బానిసలం అంటూ మా రాజ్యాన్ని మేమే స్థాపించుకుంటాం అంటూ కొన్ని పార్టీలు పుట్టుకొస్తాయి అవి పుట్టుకొచ్చిన తరువాత టిడిపి ఓట్ బ్యాంకు కి ఎటువంటి విగాతం కలగకుండా ప్రత్యర్థి పార్టీ ఓట్లను తమ వైపు ఆకర్షిస్తూ ప్రత్యర్థి పార్టీ ఓటర్ల ధ్యేయంగా పనిచేస్తాయి.
అలాగే ప్రత్యర్థి పార్టీలోని నిత్సాహవంతులైన నాయకులను (టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేసి ఓడిపోయిన) రెబల్ అభ్యర్థులను తన నోట్ల పడగ నీడలో ఓట్ల కోసం బల నిరూపణ కోసం పోటీలు చేయించడం కుదరకపోతే అదే జెండా నీడలో ఉంటూ తనకు ఓట్లు వేయించమని కోరడం. లాంటి ప్రయోగాలతో ప్రత్యర్థులను సిత్తు చేసే స్వభావి నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ వివరించారు కొందరు ప్రజలు.


ఇలాంటి స్ట్రాటజీలు కాక ఎలక్షన్ కి రెండు రోజుల ముందు నుండి మనది అనుకున్నా ఏ ఒక్క ఓటుని వదలకుండా ఎంత దూరంలో ఉన్నా సరే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకుని రప్పించి ప్రతి ఒక్క ఓటు పోల్ అదా లేదా అని చెక్ చేసుకుని నిర్ధారించుకున్నారు. వైసిపి మాత్రం ఇందుకు విరుద్ధంగా. సంక్షేమం చేసాం మనకి ఓట్లు వస్తాయి అనే ధీమాలో మాత్రమే ఉండిపోయింది.
ప్రజల సంక్షేమంపైనే దృష్టి పెట్టిన వైసీపీ ఇలాంటి శక్తివంతమైన యూనియన్లను ఆకర్షించడంలో విఫలమయింది కనీసం ఇలాంటి ఆలోచన లేకుండానే రాజకీయం నడిపారు అందువలనే ఇంతటి అభివృద్ధి జరిగినప్పటికీ ఇంతలా ఘోర పరాజయం పొందడానికి వారికి వారే కారణం అని ప్రజలు తేల్చేశారు.