SC వర్గీకరణ సారధికి క్షీరాభిషేకం

0
21

వర్గీకరణ సారధికి క్షీరాభిషేకం
నూజివీడు పట్టణంలోని స్థానిక శ్రీనివాస మహల్ సెంటర్లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి విగ్రహం వద్ద
*SC వర్గీకరణ సారధి, అభినవ అంబేద్కర్, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని నూజివీడు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కలపాల విలియమ్స్ మాదిగ అధ్యక్షతన గుండె నిండా పట్టరాని ఆనందంతో ఆనంద భాష్పాలు నిండిన కళ్ళతో జయహో కృష్ణన్న జయహో అంటూ తన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నాగేంద్రబాబు మాదిగ పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గారి అలుపెరగని మూడు దశాబ్దాల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని అన్నారు. అనరా నీ మాటలతో కనరాని భయంకర అవమానాలతో పాటు కుళ్ళు కుతంత్రాలు కలిగిన రాజకీయ నాయకుల ఎత్తుగడల ముందు తలవంచ ఎంతో శ్రమతో ఎన్నో బాధలను ఓర్చుకుని పట్టు విడవని విక్రమార్కుని వలె తన జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని తన జాతికి కాస్తంత ఉపాధి దొరికితే మునుముందు రాబోయే తరాలలో ఎనలేని గొప్ప వెలుగుని చూడవచ్చు అని నమ్మి సాగించిన ఈ 30 సంవత్సరాల పైబడిన పోరాటంలో గొంగళి పురుగులను సహితం ముద్దాడుతూ ముందుకు సాగిన మహనీయుడు మన నవయుగ అంబేద్కర్ మనమంద కృష్ణ మాదిగ అన్న అంటూ వివరించారు.
నూజివీడు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు దుబ్బాకు దేవరాజుమాదిగ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలోను, శాసనమండలిలోనూ ఏకగ్రీవంగా ఆమోదం పొందటం . ఈ యొక్క బిల్లు ఆమోదం నకు కృషి చేసిన మన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నకు కృతజ్ఞతలు తెలియజేసారు *

30కి పైగా సంవత్సరాల కళ నెరవేరిన క్షణాలు ఆనందం తో జరిగిన కార్యక్రమం

ఒక న్యాయమైన హక్కుని న్యాయంగానే సంపాదించుకోవడం ఇంత కష్టతరమైంది”

కార్యక్రమంలో ముళ్ళపూడి వెంకటేశ్వరరావు మాదిగ ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు, కొమ్ము వెంకటేశ్వరరావు గారు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్, ఉదయగిరపాల్గొని హర్షద్వానాలతో తమ ఆనందాన్ని ప్రకటించారు.