MRPS మాదిగ వారి ఆత్మ గౌరవ కవాతు.

0
96
Mrps

ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

భారత రాజ్యాంగం ఎన్నో పురిటి నొప్పులు భరించి పుట్టుకొచ్చింది. అయినప్పటికీ నానాటికి మరెన్నో అవాంతరాలను సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకి నడుస్తూ ఉంది.
అయినప్పటికీ పెత్తందారుల భూస్వాముల రాజకీయ నాయకుల స్వలాభాపేక్ష కలిగిన కులాల మధ్య వ్యక్తుల మధ్య పడి నలిగిపోతుంది రూపాంతరం చెందలేకపోతోంది. దోచుకున్న వాడికి దోచుకున్నంత తిన్నవాడికి తిన్నంత అనే చందాన ఎవడికి దొరికింది వాడు తీసుకుని పక్కవాడు ఎదుగుదలకు కాలు అడ్డం పెడుతున్నాడు ఈ రోజుల్లో కలిసి ఉంటే కలదు సుఖమని ఏరకంగా చెప్పగలం. మన రాజ్యాంగం చెప్పిన నగ్న సత్యం మన దేశం 100 రాష్ట్రాలకు పైగా విడిపోవచ్చును అప్పుడే సమచితమైన అభివృద్ధి జరుగుతుందని చెబుతుంది. కానీ కొన్ని వందల కులాలను కలిపి ఒకే ఫలాన్ని అనుభవించమని చెప్పడం సముచితం కాదు అని దీనివలన ముందు గట్టు ఎక్కిన వాడు తన వాడిని చూసుకొని చెయ్యందించుకుంటున్నాడే కానీ పక్కవాడికి అవకాశాన్ని రానివ్వడం లేదు అని గ్రహించిన మన్య శ్రీ మందా కృష్ణ మాదిగ గారు వర్గీకరణ జరిగి తీరితే అందరికీ సమ న్యాయం జరుగుతుందని భావించి ఎంఆర్పిఎస్ ను స్థాపించి 30 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో పరపతి కలిగిన ప్రతి నాయకుడికి తలవంచి తన బాధను వ్యక్తపరుస్తూ. గొంగళి పురుగులను సహితం ముద్దాడుతూ తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ జూలై 7వ తారీకు తో 30వ ఆవిర్భావ సంవత్సరం జరుపుకుంటుంది

20 -06-24, మహా జననేత మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు….
ఏలూరు జిల్లా నూజివీడుమండలం *ముక్కొల్లు పాడు గ్రామంలో MRPS నూజివీడు నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాకు దేవరాజు మాదిగ గారు గ్రామంలో MRPS నాయకుల సహకారంతో..
*హలో మాదిగ చలో వరంగల్కార్యక్రమ సమావేశం నిర్వహించి MRPS నూతన కమిటీ వేయడం జరిగింది.
విషయం :జులై – 7, ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతు కు అందరూ తెల్ల చొక్కా,నల్ల ప్యాంటు, నల్లతువాలు ధరించి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం జరిగింది.
ముక్కొల్లుపాడు MRPS నూతన కమిటీ MRPS అధ్యక్షులు గా గుడ్డేటి గోపిరాజు మాదిగ, ఉపాధ్యక్షులుగా గొల్లపల్లి పవన్ మాదిగ, ప్రధాన కార్యదర్శులుగా యంట్రపాటి నాగేంద్ర మాదిగ, కొండ్రుపాటి సత్యం మాదిగ, ఆముదాల ఏ సుబాబు మాదిగ. నంది పాము చైతన్య మాదిగ,MRPS అధికార ప్రతినిధులుగా వక్కలగడ్డ చిన్న ఐలయ్య మాదిగ, యంట్రపాటి కుమార్ మాదిగ, గుడ్డేటి జాన్ బాబు మాదిగ, కొపూరి సునీల్ మాదిగ, గుడ్డేటి ఇంద్రబాబు మాదిగ


మరియు MSP అధ్యక్షులుగా వీరమల్ల ప్రసాద్ మాదిగ, ఉపాధ్యక్షులుగా వీరమల్ల లక్ష్మణ్ మాదిగ, జనరల్ సెక్రెటరీగా ముళ్ళపూడి నాగరాజు మాదిగ, అధికార ప్రతినిధులుగా గుడ్డేటి ప్రేమ్ కుమార్ మాదిగ, ముళ్ళపూడి ప్రశాంత్ మాదిగ, వక్కలగడ్డ చంటి మాదిగ, కొండ్రుపాటి కుమారస్వామి మాదిగ ల ను నియమించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా MSP జిల్లా ఉపాధ్యక్షులు ముళ్ళపూడి వెంకటేశ్వరరావు మాదిగ గారు, ఆగిరిపల్లి మండలం MSP ఇంచార్జి కలపాల విలియమ్స్ మాదిగ గారు, నూజివీడు నియోజకవర్గం MRPS ప్రధాన కార్యదర్శి డోలా రాంబాబు మాదిగ గారు,గ్రామ పెద్దలు యువతీ యువకులు పాల్గొన్నారు