TDP కూటమిని గెలిపించుకున్న కుటుంబాలకు మనవి.

తప్పనిసరిగా ఇవి చెయ్యండి.

0
120

కూటమికి ఓట్లు వేసుకొని గెలిపించుకున్న కుటుంబాలకు విజయం వరించినందుకు సంతోషంగా అభినందనలు తెలుపుతూ తమ ఓటమిని అంగీకరిస్తూ వైఎస్ఆర్ సిపి తరఫు కుటుంబాలు ఒక మనవి చేస్తున్నాయి.
అలాగే వైసిపి పార్టీలోని ప్రతి ఒక్క వ్యక్తికి జాగ్రత్త వహించమని ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాయి
మరీ ముఖ్యంగా కూటమిని బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన కుటుంబాల కు ఓటమిని అంగీకరిస్తున్న ప్రజలు చేసుకుంటున్నా విన్నపం ఏమిటంటే మీ విజయం ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు అందరూ సమిష్టిగానే కృషిచేసి విజయం సాధించారు. అలాగే ముందుగానే కొన్ని నిబంధనలకు ఒప్పుకొని మీరు ఓట్లు వేసి గెలిపించుకున్నారు

దీనికి అంగీకరించే.. కదా మీరు ఓటు వేసింది.


అవి. 1) ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మీ పిల్లలు మొద్దబ్బాయిలు అయిపోతారు అంటూ చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఇంగ్లీష్ మీడియం వద్దు అని అడ్డం తిరిగినా.. ఇంగ్లీష్ మీడియం పెట్టి ట్యాబ్లు బూట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది బైజుస్ కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది కేవలం యూట్యూబ్లో చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పినప్పటికీ మీరు సంతోషంగా ఓట్లు వేశారు కాబట్టి మీకు కుదిరితే ఆ ఇంగ్లీష్ మీడియం తీసేయమని చెప్పండి
2) వాలంటరీ వ్యవస్థ వలన ఇంట్లో మగవారు లేనప్పుడు ఆడవారి కోసం వెళ్లి తలుపులు కొట్టడం లాంటి దుశ్చర్యలు చేస్తున్నారు అన్నారు కాబట్టి అమ్మాయిలను టాపింగ్ చేసి దాదాపుగా 36వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ కి కారణం అయ్యారు అని చెప్పారు కాబట్టి దయచేసి ఆ వాలంటరీ వ్యవస్థను తీసేయమని చెప్పండి
3) గ్రామపంచాయతీ వ్యవస్థ ఉండగా సచివాలయ వ్యవస్థ తీసుకు రావలసిన అవసరం ఏమిటి అని అడ్డం తిరిగి మాట్లాడారు కాబట్టి దయచేసి ఆ సచివాలయ వ్యవస్థను ఆ సిబ్బందిని పూర్తిగా తొలగించి వేయండి అని చెప్పండి.


4) అమ్మబడి ఆసరా వాహన మిత్ర కాపు నేస్తం లాంటి పథకాలు ఇవ్వడం వలన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అలాగే మా రెక్కల కష్టంతో మేము కట్టిన టాక్సులతో అమ్మ ఒడిలాంటి పథకాలు ఇవ్వడానికి నీవు ఎవడివి అంటూ మాట్లాడినారు. కాబట్టి ఆ పథకాలను ఆపివేయమని చెప్పండి.

ఇకపై మీరు చేయవలసింది ఇదే….


అతి ముఖ్యముగా జగన్ మున్సిపల్ వర్కర్స్ కి జీతాలు పెంచాడు అలాగే వెలుగు పథకం లోని ఉద్యోగులను ఆశా వర్కర్స్ ని రెగ్యులరైజ్ చేశాడు ఆర్టీసీ వారిని గవర్నమెంట్ పరం చేశాడు దీనివల్ల ప్రస్తుత ఓటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని తీసివేయమని చెప్పండి
కుదిరితే ఈ ఐదు సంవత్సరాల లోనే ఓ 20 లేదా ఓ 30 లక్షల కోట్లు అప్పు తెచ్చి అయినా సరే అమరావతిని కట్టమని చెప్పండి పేదవాడు కానీ, పార్టీ కాని వాడు కానీ, లోనికి రావడానికి వీలు లేకుండా పవర్ ఫెన్సింగ్ కూడా వెయ్యమని చెప్పండి.
బీద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ అంటూ బోర్డులు పెట్టుకుని గత ఐదు సంవత్సరాల కు ముందు కాలంలో బాగుగా రాయితీలు రిజర్వేషన్ల పేరుతో సంపాదించుకొని. ఇప్పుడు ఇలాంటి పథకాలు మాకు వద్దు అంటూ మీ వెనకే ఉండిపోయి మా భవిష్యత్తుతోను మా పిల్లల భవిష్యత్తు తొను మీకు నచ్చిన విధంగా ఆడుకోండి. అంతేగాని మీకు అవసరమైనప్పుడు మా బీదలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు అంటూ మీరు తొక్కేసిన మా బ్రతుకులను మా పిల్లల బ్రతుకులను మీతో కలిపి మీ వెనక గొర్రెల్లా నడిచే విధంగా మాత్రం చేయకండి.

మీరు మీ పిల్లలు మాత్రమే. రిజర్వేషన్లు లబ్ది పొందితే సరిపోతుందా.


రిజర్వేషన్ల పేరుతో రాయితీల పేరుతో ముందుగా మీరు బాగుపడి మా వంతు వచ్చేసరికి మా నోటి కాడ కూడు లాగేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయవద్దు
అంటూ. ఆయా వర్గాలకు సంబంధించిన ప్రజలు లబోదిబోమంటూ రోదస్తున్నారు ప్రాధేయ పడుతూ వారి వారి వర్గంలో ముందుగా రిజర్వేషన్లు పొంది రాయితీలు పొంది నాలుగు రూపాయలు సంపాదించుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొని వారి పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించుకుంటూ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ జల్సా చేస్తున్నారు మా వంతు వచ్చేసరికి మా పిల్లలకి సరైన చదువు సరైన తిండి మాకు సరైన ఉపాధి లేకుండా మా వర్గం వాళ్లే చేస్తున్నారు అంటూ చాలామంది వారి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు అలా వ్యక్తపరుస్తూనే
తమ ఎదుగుదలను ఓర్వనీ తమ తమ కులాలలోని కొంతమంది కలసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న ప్రతి కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నారు